బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత..బయోగ్రఫీ

28
- Advertisement -

దివంగత ఎమ్మెల్యే జి. సాయన్న, గీత దంపతుల రెండో కుమార్తె నివేదిత. ఆమె 24-11-1983న హైదరాబాద్ లో పుట్టారు. సెయింట్ ఆన్స్ హైస్కూల్ లో ఆమె విద్యాభ్యాసం కొనసాగింది. ఎస్ఆర్ నగర్ లోని గౌతమి జూనియర్ కాలేజీ నుంచి ఇంటర్ పూర్తి చేశారు. జేఎన్టీయూ పరిధిలోని భోజిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశారు.

నివేదితకు చిన్నప్పటి నుంచి రాజకీయాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంది. ముఖ్యంగా సాయన్న ఎక్కడికి వెళ్లినా నివేదిత వెంట కనిపించేవారు. అలా బీఆర్ఎస్ శ్రేణులందరితోనూ ఆమెకు మంచి పరిచయాలున్నాయి. అందరినీ అన్నా అంటూ ఆప్యాయంగా పిలుస్తూ గులాబీశ్రేణులందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. దివంగత సాయన్న చివరిరోజుల్లో నివేదిత ఆయన వెంటే ఉండి, నియోజకవర్గ అభివ్రుద్ధి కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు.

దివంగత ఎమ్మెల్యే సాయన్న మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో సాయన్న కుటుంబం నుంచే తన సోదరి లాస్యనందితను గెలిపించుకోవడంలోనూ నివేదిత ముఖ్యపాత్ర పోషించారు. లాస్యనందితకు కీలకమైన సూచనలు, సలహాలు చేస్తూ పెద్దదిక్కుగా నిలిచారు. అయితే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో….. నివేదితకు టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.

Also Read:పాలు ఏ టైమ్ లో తాగితే మంచిదో తెలుసా?

- Advertisement -