ఇకపై గంటల్లోనే చెక్ క్లియర్ కానుంది. ఆర్బీఐ – చెక్ ట్రంకేషన్ సిస్టమ్‌ను “కాంటిన్యూయస్ క్లియరింగ్ విత్ ఆన్-రియలైజేషన్ సెటిల్‌మెంట్” విధానానికి మార్చనుంది. ఇది 2 దశల్లో అమలుకానుంది.
చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS)ను ప్రస్తుత బ్యాచ్ ప్రాసెసింగ్ విధానం నుండి కాంటిన్యూయస్ క్లియరింగ్ విత్ ఆన్-రియలైజేషన్ సెటిల్‌మెంట్ విధానానికి ఆర్బీఐ మార్చనుంది. ఈ మార్పు రెండు దశల్లో జరుగుతుంది — మొదటి దశ 2025 అక్టోబర్ 4న, రెండవ దశ 2026 జనవరి 3న ప్రారంభమవుతుంది.
చెక్ ప్రెజెంటేషన్ సెషన్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఒక్కటే ఉంటుంది. బ్యాంకు బ్రాంచ్‌లకు వచ్చిన చెక్కులు వెంటనే స్కాన్ చేసి, ప్రెజెంటేషన్ సెషన్ సమయంలో క్లియరింగ్ హౌస్‌కి నిరంతరంగా పంపబడతాయి.
క్లియరింగ్ హౌస్, చెక్ ఇమేజ్‌లను డ్రాయీ బ్యాంకులకు (చెల్లింపుదారుల బ్యాంకులు) నిరంతరంగా పంపిస్తుంది.ప్రతి చెక్‌కు డ్రాయీ బ్యాంక్ — పాజిటివ్ కన్ఫర్మేషన్ (ఆమోదం పొందిన చెక్కులకు) లేదా నెగటివ్ కన్ఫర్మేషన్ (తిరస్కరించబడిన చెక్కులకు) ఇస్తుంది.
చెక్ ఇమేజ్ అందుకున్న వెంటనే డ్రాయీ బ్యాంక్ రియల్ టైమ్‌లో ప్రాసెస్ చేయాలి. ఉదయం 11 గంటల నుండి ప్రతి గంటకొకసారి సెటిల్‌మెంట్ జరుగుతుంది — ఇది పాజిటివ్ కన్ఫర్మేషన్ పొందిన చెక్కుల ఆధారంగా ఉంటుంది. ప్రెజెంటింగ్ బ్యాంక్, పాజిటివ్/నెగటివ్ కన్ఫర్మేషన్ సమాచారం ప్రాసెస్ చేసి, సేఫ్టీ ప్రమాణాలను పాటిస్తూ, కస్టమర్‌కి చెల్లింపు సక్సెస్‌ఫుల్ సెటిల్‌మెంట్‌కి 1 గంటలోపు విడుదల చేయాలి.
Also Read:ఈ జ్వరాలతో.. జాగ్రత్త !
