కానిస్టేబుల్‌ సేవలు అమోఘం:హరీశ్ రావు

49
- Advertisement -

ఆరాంఘర్‌ నుంచి ఎల్బీనగర్ వైపు వెళ్తున్న బాలరాజజు అనే వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో…అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. ఈఘటన ఆరాంఘర్‌లో జరిగింది. ఉదయం 9.30గంటల సమయంలో ఆరాంఘర్ నుంచి ఎల్బీనగర్‌ వైపు వెళ్తున్న బాలరాజు అనే వ్యక్తికి గుండెపోటు వచ్చింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గమనించి వెంటనే సీపీఆర్ చేశారు. దీంతో వెంటనే స్పృహలోకి వచ్చి ఊపిరి తీసుకోవడం మొదలు పెట్టారు. ఆ వెంటనే కానిస్టేబుల్ రాజశేఖర్‌.. బాలరాజును స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడాడు. దీంతో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

సీపీఆర్‌ చేయడం ద్వారా ఒక మనిషి అమూల్యమైన ప్రాణాలను కాపాడి కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ గొప్ప పనిచేశారని మంత్రి హరీష్‌ రావు ప్రశంసించారు. వచ్చే వారం తెలంగాణ ప్రభుత్వం ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగులు, కార్యకర్తలకు సీపీఆర్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రోడ్లపై గుండెపోటుతో కుప్పకూలుతున్న ఘటనలు పెరిగిపోతుండటంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి ట్వీటర్‌ ద్వారా పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి…

ఎంసెట్ షెడ్యూల్‌ విడుదల…

మొక్కలు నాటిన పర్వతారోహకుడు అన్మిష్ వర్మ..

రాష్ట్రానికి అమిత్ షా..షెడ్యూల్ ఖరారు

- Advertisement -