ఇవి తింటే కండ్లకలక దూరం!

74
- Advertisement -

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కండ్లకలక వ్యాధి ఏ స్థాయిలో ప్రభల్లుతోందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రోజు రోజుకు ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. చాలా రాష్ట్రాలలో కండ్లకలక పేషెంట్లతో ఆసుపత్రులు కిక్కిరిస్తున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. ఇది ప్రాణాంతకమైన వ్యాధి కానప్పటికి.. దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే ఈ వ్యాధి.. అంటువ్యాధి కావడంతో తగు ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం ఎంతో ఉత్తమం..

ఈ వ్యాధి సోకిన వారు యాంటీ బయోటిక్ డ్రాప్స్ ను వాడాలి. ఇంకా కళ్లను ఎప్పటికప్పుడు గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుత్ము ఉండాలి. ఇంకా కండకలక వచ్చిన వారికి దూరం పాటించడం ఉత్తమం. ఆ వ్యక్తి వస్తువులు గాని దుస్తులు గాని వాడకూడదు. అయితే ఈ జాగ్రత్తలు పాటిస్తూనే మనం తినే ఆహారం విషయంలో కూడా ఎంతో జాగ్రత్త పాటించాలి. ముఖ్యంగా కళ్ళుకు మంచి చేసే విటమిన్ ఏ ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి/ ఆకు కూరలు, కూరగాయలలో విటమిన్ ఏ మెండుగా ఉంటుంది.

కాబట్టి వీటిని మన ఆహార డైట్ లో ఉండేలా చూసుకోవాలి. కళ్ల ఆరోగ్యానికి క్యారెట్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇందులో విటమిన్ ఏ తో పాటు బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్ల సమస్యలను దూరం చేసి కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇక ఆరెంజ్, నల్ల ద్రాక్ష, ఎర్ర ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్లు కూడా కళ్ళకు ఎంతో మేలు చేస్తాయి. ఇంకా చేపలు కూడా కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్ ఎలాంటి కళ్ల సమస్యలనైనా దూరం చేస్తాయట. అందుకే కండ్ల కలక వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత రోజుల్లో కళ్ళకు మేలు చేసే ఆహార పదార్థాలను తప్పకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:షర్మిల చేరికపై ఎందుకీ మౌనం?

- Advertisement -