ప్రస్తతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా లోక్ సభ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. పలు ప్రధాన పార్టీలు ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తుండగా ఆ సభలకు జనాదరణ కరువైంది. పట్టుమని పదుల సంఖ్యలో కూడా జనాలు రావడం లేదు. ఇలాంటి పరిస్థితే తాజాగా తమిళనాడులో కాంగ్రెస్‌కు ఎదురైంది.
ఇక అసలు విషయం ఏంటంటే.. కాంగ్రెప్ పార్టీ తమిళనాడులోని ఓ ప్రాంతంలో భారీ బహిరంగ నిర్వహించారు. అయితే ఆ సభకు జనం రాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. కాగా న్యూస్ కవరేజ్ కోసం అక్కడికి వచ్చిన ఓ ఫొటో జర్నలిస్ట్ ఒకరు ఖాళీగా ఉన్న కుర్చీలను ఫొటో తీసేందుకు యత్నించారు. దీంతో అక్కడున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆ జర్నలిస్ట్‌పై దాడికి దిగారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడి నుంచి అతన్ని సహచర పాత్రికేయులు కాపాడారు. రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.