కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ

2
- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గద్వాల్ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న వడ్డేపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 10 స్థానాలకు గాను 8 స్థానాలు గెలుచుకుని ఆధిపత్యం చాటిన ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్(All India Forward Bloc) కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో ఆ కౌన్సిలర్లు జూబ్లీహిల్స్‌లో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుని రేవంత్ రెడ్డిను కలిశారు. అధికారికంగా సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. దీంతో వడ్డేపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారనున్నాయి.

ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున గెలిచిన సభ్యుల ఈ నిర్ణయం గద్వాల్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీ పాలనలో స్థిరత్వం, అభివృద్ధి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిలర్లు పేర్కొంటున్నారు.

ఈ పరిణామంతో వడ్డేపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పట్టు మరింత బలపడనుంది. రాబోయే స్థానిక సంస్థల రాజకీయాల్లో ఈ మార్పు కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -