ఖమ్మంలో కాంగ్రెస్ గెలుపు..

29
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ ఖాతా తెరచింది. ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకుంది కాంగ్రెస్. ఆ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురామ్ రెడ్డి.. 3,64,341 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. మెుదటి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం సాధించిన ఆయన అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 8, మజ్లిస్ ఒక స్థానంలో విజయం సాధించారు.

మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. తొమ్మిదో రౌండ్ పూర్తయ్యేసరికి ఆయన 2 లక్షలకు పైగా మెజార్టీతో కొనసాగుతున్నారు.★మహబూబాబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్‌ పదో రౌండ్ ముగిసేసరికి 1.60 లక్షల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 8వ రౌండ్ పూర్తయ్యేసరికి 20 వేల పైచిలుకు ఓట్ల మెజార్జీతో ముందంజలో ఉన్నారు.

చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి దూసుకెళ్తున్నారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వెనుకంజలో ఉండటం గమనార్హం.

Also Read:నాలుగోసారి సీఎంగా చంద్రబాబు!

- Advertisement -