Congress:కాంగ్రెస్ జన జాతర సభ

38
- Advertisement -

హైదరాబాద్ తుక్కుగూడ వేదికగా పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది కాంగ్రెస్ పార్టీ. జనజాతర పేరుతో ఈ సభకు దాదాపు 10 లక్షల మందిని తరలించేలా కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదే వేదిక ద్వారా ఏఐసీసీ పాంచ్ న్యాయ్ పచ్చిస్ గ్యారంటీ పేరుతో ఐదు రకాల ప్రధాన హామీలు కాంగ్రెస్ అగ్రనేతలు ఇవ్వనున్నారు.

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ,మల్లికార్జున ఖర్గే తదితరులు ఈ సభకు హాజరుకానున్నారు. అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున నేతలు తరలిరానున్నారు. 60 ఎకరాల్లో సభా ప్రాంగణం, 700 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ అవకాశం కల్పించారు. వేసవికాలం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా కాంగ్రెస్ అధిష్టానం అన్ని ఏర్పాట్లు చేసింది.

తుక్కుగూడ వేదికగానే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించగా సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. ఈసారి మేనిఫెస్టోలో తెలంగాణ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వంద రోజుల పాలన విజయాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రజలకు ఏఐసీసీ అగ్రనేతలు సభలో వివరించనున్నారు.

Also Read:TTD: తొలిసారి తెలుగు క్యాలెండర్

- Advertisement -