ఆరు గ్యారెంటీలు అమలు చేయాల్సిందే: కవిత

19
- Advertisement -

కురుమ సంఘం నాయకులు హమాలీ శ్రీను ఆధ్వర్యంలో మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ లోపెద్ద ఎత్తున పూలతో ఘన స్వాగతం పలికాయి బీఆర్‌ఎస్‌ శ్రేణులు. మహిళ దినోత్సవం సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఎమ్మెల్సీ కవిత.

మల్లాపూర్ మహిళలతో మహిళ దినోత్సవం జరుపుకోవడం సంతోషకరం అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలు సంతోషంగా లేరు… కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కు 2500 ఇస్తదని మోసం చేసిందన్నారు.

ఆరు గ్యారెంటీ లు అమలయ్యే వరకు వదిలి పెట్టం.. కాంగ్రెస్ కేవలం మాటల సర్కార్ అన్నారు. కాంగ్రెస్ వాళ్ళ మాటలు విని తెలంగాణ ప్రజలు మోసపోయారు..కాంగ్రెస్ సర్కార్ పాలనలో కళ్యాణ లక్ష్మీ పథకం, తులం బంగారం రావడం లేదు అన్నారు.

Also Read:కెనడా నూతన ప్రధానిగా మార్క్‌ కార్నీ

- Advertisement -