టీ కాంగ్రెస్ బిగ్ ప్లాన్.. బరిలోకి సోనియా?

28
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ చేస్తోంది. ఈసారి లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ కు అత్యంత కీలకం కావడంతో అన్నీ రాష్ట్రాల్లో పట్టు కోసం భారీ ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో 17 స్థానాలకు గాను వీలైనన్ని సీట్లు గెలుచుకోవాలనే ప్లాన్ లో ఉంది. గత ఎన్నికల్లో కేవలం మూడు సీట్లు మాత్రమే గెలుచుకోగా… ఈసారి అంతకు మించి సీట్లు గెలుచుకోవాలనే ప్లాన్ లో ఉన్నారు హస్తం నేతలు. పైగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం పార్టీకి కలిసొస్తుందని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేతలను రాష్ట్రంలో ఎన్నికల బరిలో దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ప్రియాంక గాంధీ తెలంగాణ నుంచి లోక్ సభ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉందనే గుసగుసలు వినిపించాయి.

ఇప్పుడు సోనియా గాంధీ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయిస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే ఆలోచనలో ఆ పార్టీ అగ్రనేతలు ఉన్నారట. సోనియా గాంధీ కోసం ఇప్పటికే టీ కాంగ్రెస్ సీట్ల పరిశీలనలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ అధిక అసెంబ్లీ స్థానాలను సొంతం చేసుకుంది. అందుకే ఈ మూడు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి లోక్ సభ స్థానానికి సోనియా గాంధీని బరిలో దించే ఆలోచనలో ఉన్నారట. సోనియా గాంధీ కూడా తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు సుముఖంగానే ఉన్నట్లు టాక్. మరి నిజంగానే సోనియా గాంధీ తెలంగాణ బరిలో నిలుస్తారా ? లేదా ప్లాన్ చేంజ్ చేసి నార్త్ ఇండియా వైపే మొగ్గు చూపుతారా ? అనేది చూడాలి.

Also Read:KTR:సంక్షేమ పథకాల రద్దుకు కుట్ర

- Advertisement -