అధికారంలో ఉన్నామా..ప్రతిపక్షంలో ఉన్నామా?

7
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా చైర్ పర్సన్ సుప్రియ శ్రీనేట్. మనం అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామా అని పార్టీ నేతలను చీవాట్లు పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్వాన్నంగా తయారైంది అని మండిపడినట్లు తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యులు సతీష్ మన్నె, నవీన్ పెట్టెం మీద కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా చైర్ పర్సన్ సుప్రియ శ్రీనేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించడంలో మీరిద్దరు ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు.

ఇటీవల హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సుప్రియ. అధికారంలో మనమే ఉన్నాం. నిధులకు కొరత లేదు, అయినా ప్రతిపక్షాల విమర్శలను ఎందుకు సమర్ధవంతంగా ఎదుర్కొలేకపోతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీదే హవా కనపడుతుంది…. మన కాంగ్రెస్ పార్టీ బాగా వెనుకబడింది అని సుప్రియ అన్నారు.

ఇక మీవల్ల కాదు కానీ, ముఖ్యమైన కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాలు అన్నీ ఢిల్లీ నుండి మేమే చూసుకుంటాం అని తెగేసి చెప్పిందట. అంతేగాదు సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే ఒక యువ మహిళా కాంగ్రెస్ నేతకు ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం.

Also Read:TTD:న‌వంబ‌రు 7న మిక్సిడ్‌ రైస్‌ టెండర్‌ వేలం

- Advertisement -