కోమటిరెడ్డికి షోకాజ్‌ నోటీస్‌..

572
rajagopal reddy
- Advertisement -

కాంగ్రెస్ నేత,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్‌ అయింది. పీసీసీ క్రమశిక్షణ సంఘం రాజగోపాల్‌ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది.కోదండరెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్‌లో భేటీ అయిన క్రమశిక్షణా కమిటీ.. పార్టీని, రాహుల్ గాంధీని రాజగోపాల్ రెడ్డి అవమానించారని చెప్పింది. దీనిపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్‌ లేదని, టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్నారు. అలాగే ఎన్నికల్లో ఓటమికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని.. కానీ తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాంటి నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు.

దీంతో పాటు 2018, సెప్టెంబర్‌ 18న కుంతియా, ఉత్తమ్‌లపై అసభ్యకరమైన పదాలతో దూషించిన నేపథ్యంలో జారీ చేసిన షోకాజు నోటీసు అంశాన్నీ తాజా నోటీసులో గుర్తు చేశారు. ఏఐసీసీ అనుమతి లభించిన నేపథ్యంలో బుధవారం షోకాజు నోటీసు జారీ చేయగా 10 రోజుల్లో వివరణ ఇవ్వకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో కోదండరెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -