Jagan:జగన్‌పై పోటీకి..భారీ స్కెచ్!

20
- Advertisement -

ఏపీలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ ను గట్టిగానే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. 2014 తర్వాత ఏపీలోని కాంగ్రెస్ నేతలందరిని తన పార్టీలో కలిపేసుకున్న జగన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు హస్తం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది, పూర్వ వైభవం కోసం పాటు పడుతూనే జగన్ టార్గెట్ గా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే వైఎస్ షర్మిలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో పాటు కడప ఎంపీ టికెట్ ను కూడా కేటాయించింది అధిష్టానం. అంతే కాకుండా ఇప్పుడు జగన్ పోటీ చేసే పులివెందుల సీటుపై కూడా కాంగ్రెస్ గట్టిగానే దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. పులివెందులలో కాంగ్రెస్ తరుపున దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మను బరిలో దించే ఆలోచనలో హస్తం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. .

వివేకా హత్య విషయంలో జగన్ పై కడప జిల్లాలో ఎంతో కొంత అసమ్మతి ఏర్పడిందనేది చాలమంది చెబుతున్న మాట. ఈ అసమ్మతిని అనుకూలంగా ఏపీలో పూర్వ వైభవం పొందాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ తరుపున వివేకా భార్య సౌభాగ్యమ్మ నిజంగానే పోటీ చేస్తే జగన్ ఓటు బ్యాంకులో చీలిక రావడం ఖాయం. అటు టీడీపీ నుంచి పులివెందుల బరిలో బీటెక్ రవి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ తరుపున సౌభాగ్యమ్మ కూడా పోటీ చేస్తే జగన్ కు ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే ఆమె రాజకీయాల వైపు ఆసక్తి చూపిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే షర్మిల, సునీత, విజయమ్మ.. ఇలా కుటుంబ సభ్యులంతా జగన్ కు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతో కుటుంబ సభ్యుల నుంచి ఎదురవుతున్న ఈ పోరు జగన్ కలవర పెట్టడమే కాకుండా పార్టీని కూడా గట్టిగానే దెబ్బ తీసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం వైఎస్ కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Also Read:Congress:కాంగ్రెస్ జన జాతర సభ

- Advertisement -