కాంగ్రెస్.. అదే స్ట్రాటజీ రిపీట్ !

38
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడుగా వ్యవహరిస్తోంది. కర్నాటక ఎన్నికల్లో లభించిన విజయం టి కాంగ్రెస్ నేతలకు గట్టిగానే బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. అందుకే వర్గపోరు ఆధిపత్య పోరులను పక్కన పెట్టి ప్రస్తుతం అందరూ ఒకే నినాదంతో సాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సౌత్ రాష్ట్రాలపై గట్టిగా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్.. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోంది. అందులో భాగంగానే కర్నాటక ఎన్నికల స్ట్రాటజీని తెలంగాణలో కూడా అమలు చేయాలని చూస్తోంది.

తాజాగా టి కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో ప్రధానంగా కర్నాటక వ్యూహాలనే చర్చకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కర్నాటకలో ఏదైతే వ్యూహాలను అమలు చేసి అధికారంలోకి వచ్చిందో అదే వ్యూహాలను తెలంగాణలో కూడా అమలు చేసి అధికారంలోకి రావాలంటే పట్టుదలతో ఉంది. కర్నాటక ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించడంలో ఆ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో కీలక పాత్ర పోషించిందనే చెప్పవచ్చు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. ఇలా మేనిఫెస్టోలోని చాలా అంశాలు కన్నడ ప్రజలను గట్టిగానే ఆకర్షించాయి.

Also Read: మాజీ ఎంపీ సోలిపేట మృతి…సీఎం సంతాపం

ఇప్పుడు అదే విధంగా తెలంగాణ ప్రజలను ఆకర్శించేందుకు మేనిఫెస్టోపై గట్టిగానే కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. అయితే కర్నాటకలో అప్పటికే బీజేపీ పై ప్రజా వ్యతిరేకత ఉండడంతో అది కాస్త కాంగ్రెస్ కు ప్లస్ అయింది. అయితే తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. తెలంగాణలో కే‌సి‌ఆర్ పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్నాటక వ్యూహాలను తెలంగాణలో అమలు చేసినప్పటికీ కాంగ్రెస్ కు పెద్దగా ఒరిగేదెమి లేదనేది కొందరి అభిప్రాయం. మరి మొత్తానికి హస్తం పార్టీ కర్నాటక స్ట్రాటజీ తెలంగాణలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Also Read: MODI:ఒకే దేశం రెండు చట్టాలా..? అవసరమా..!

- Advertisement -