సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. జనవరి 6వ తేదీ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్.. తాజాగా ఆ ఈవెంట్‌ను రద్దు చేసినట్లు ప్రకటించింది. పోలీస్ పర్మీషన్స్, సెక్యూరిటీ అనుమతులు రాకపోవటం వల్లే హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో జరగాల్సిన ఈవెంట్ రద్దు అయినట్లు టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు అభిమానులను అలరిస్తున్నాయి.
చిత్ర బృందం కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. జనవరి 12న సినిమా విడుదల కాబోతున్నట్లు చెబుతున్న ఈ పోస్టర్ లో మహేశ్ బీడీ కాలుస్తూ.. కోపంగా చూస్తున్న ఫొటో అదిరిపోయింది. నోట్లో బీడీ.. కళ్లల్లో కోపం.. మహేశ్ న్యూ లుక్ అదుర్స్ అంటూ మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాకపోతే, ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవ్వడమే ఫ్యాన్స్ ను బాధ పెడుతుంది. నిజానికి ఈ ఈవెంట్ రద్దు వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం కోపం దాగి ఉందని టాక్. మహేష్ కేటీఆర్ తో చాలా సన్నిహితంగా ఉంటాడు. పైగా గతంలో కేటీఆర్ తో కలిసి ఇంటర్వ్యూలు కూడా చేశాడు.
దీనికితోడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే.. మహేష్ నుంచి రావాల్సిన స్థాయిలో అభినందన రాలేదు. అందుకే, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో జరగాల్సిన గుంటూరు కారం ఈవెంట్ కు తమ సహకారం ఇవ్వలేదు అని టాక్. ఇప్పటికైనా మహేష్ తేరుకుని కాంగ్రెస్ పెద్దలతో సన్నిహితంగా ఉంటాడేమో చూడాలి. ఇక శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గుంటూరు కారం. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన కుర్చీ మడతపెట్టి సాంగ్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది. యూట్యూబ్ లో 20 మిలియన్ వ్యూస్ దూసుకుపోతోంది.
Also Read:‘ఫ్యాటీలివర్’తో ప్రాణాలకే ముప్పు!