ఇవాళ ఎల్బీ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగసభను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీపై ప్రశ్నల వర్షం కురిపించింది తెలంగాణ కాంగ్రెస్. తెలంగాణ ప్రజలను మోడీ పదే పదే మోసం చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించింది కాంగ్రెస్.
()కాజీపేటలో రైలు కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది ?
()బయ్యారం ఉక్కు కర్మాగారం మరియు ITIR విషయంలో ప్రధానమంత్రి ఎందుకు విఫలమయ్యారు ?
()జనాభా గణన లేదా కుల గణన చేయలేనప్పుడు, మాదిగ ఉప-కోటా కోసం ప్రధానమంత్రి వాగ్దానం కేవలం అబద్ధం మాత్రమేనా ?
()2022లో గుజరాత్‌లో మరో రూ. 20,000 కోట్ల ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్లాంట్‌ను ప్రధాని ప్రకటించారు. డిసెంబర్ 2022లో కాజీపేటలో ప్లాంట్‌ను నిర్మించబోమని కేంద్రం మళ్లీ స్పష్టం చేసింది. గత ఏడాది తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు ముందు, కేంద్రం తన నిర్ణయాన్ని మరోసారి మార్చుకుంది. కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఓవర్‌హాలింగ్ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. ఏడాది తర్వాత, ఈ ప్రణాళిక కూడా కార్యరూపం దాల్చలేదు.
Also Read:KTR:కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలివే?
()తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను మోడీ సర్కార్ ఎందుకు నిర్లక్ష్యం చేసింది ? ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలపై ప్రధాని సవతి తల్లిగా వ్యవహరిస్తున్న తీరుకు అంతం లేదా ?
()మాదిగ సామాజిక వర్గానికి సబ్-కోటా కావాలని చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వారి డిమాండ్‌పై ప్రధాన మంత్రి ఇటీవలే పెదవి విప్పటం ప్రారంభించారు. అదే సమయంలో, సాంఘిక ఆర్థిక కుల గణనను ఆమోదించడానికి ప్రధాన మంత్రి నిరాకరించారు. ఇది వాస్తవానికి మాదిగ సమాజం యొక్క సామాజిక ఆర్థిక స్థితి గురించి వాస్తవాలను అందిస్తుంది. తెలంగాణలోని షెడ్యూల్డ్ కులాల జనాభాకు సంబంధించిన సమాచారాన్ని అందించే 2021లో జరగాల్సిన సాధారణ దశాబ్ద జనాభా గణనను కూడా నిర్వహించడానికి ప్రధాని నిరాకరించారు.
()కుల గణన ప్రతిపాదనపై ప్రధాని తన వైఖరిని స్పష్టం చేయగలరా ? లేని పక్షంలో మాదిగ సామాజికవర్గానికి ఉప కోటాలను ఎలా ప్రారంభించాలని ఆయన యోచిస్తున్నారు ? అని కాంగ్రెస్ ప్రశ్నల వర్షం కురిపించింది.