- Advertisement -
17న (రేపు) టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ.డి కార్యాలయం ముందు నిరసన, ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ, నరేంద్ర మోడీ రాజకీయ కక్ష సాధింపు ధోరణిని నిరసిస్తూ ఎల్లుండి 17వ తేదీన గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఈ.డి కార్యాలయం ముందు టీపీసీసీ అధ్యర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్ష పూరితంగా ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నట్లు వెల్లడించారు.
జిల్లా కేంద్రాలలో కూడా రేపు డీసీసీ ల ఆధ్వర్యంలో ధర్నాలు చేయాలని పిలుపు ఇచ్చింది పీసీసీ. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని టీపీసీసీ పేర్కొంది.
Also Read:ఏపీ రాజ్యసభ ఉప ఎన్నిక..షెడ్యూల్
- Advertisement -