కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు క్షణ క్షణానికి మారుతున్నాయి. ఎప్పుడూ ఏ ప్రకటన వెలువడుతుందో ప్రజలు ఉహించలేకపోతున్నారు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటలేకపోయింది. దీంతో కర్ణాటక రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ఇక కర్ణాటకలో జేడీఎస్ పార్టీ మద్దతు కీలకంగా మారనుంది. కాంగ్రెస్, జేడీఎస్ తో పొత్తు పెట్టుకునేందుకు మంతనాలు జరుపుతుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దేవగౌడ కు ఫోన్ చేసినట్లు సమాచారం. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ఎటువంటి నిర్ణయానికైనా సిద్దపడుతుంది.
కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య పోత్తు గురించి చర్చలు దాదాపు ముగిసినట్టే అని తెలుస్తుంది. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్టే అని సమాచారం. వీరిద్దరి మధ్య జరిగిన ఒప్పందంలో పలు విషయాలు బయటకు వచ్చాయి. జేడీఎస్ అభ్యర్దికి సీఎం పదవి ఇస్తామని హామి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక అంతేకాకుండా జేడీఎస్ కు 14, కాంగ్రెస్ కు 20 మందికి మంత్రి పదవులు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి బయటినుంచి మద్దతిస్తామన్న కాంగ్రెస్ ప్రతిపాదనను దేవెగౌడ తిరస్కరించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా పాలుపంచుకోవాలని ఆయన కోరినట్టు సమాచారం. ఈ ఒప్పందానికి అటు కాంగ్రెస్ ఇటు జేడీఎస్ నేతలు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇక వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరితే కనుక కర్ణాటకలో జేడీఎస్ , కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎర్పాటు చేయనున్నాయి. మ్యాజిక్ ఫిగర్ దగ్గరి దాకి వచ్చి ఆగిపోయిన బీజేపీకి ఇది షాకింగ్ వార్తగా చెప్పుకొవచ్చు.