ఎటూ తేలని ఖమ్మం పంచాయతీ!

17
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడే కొద్ది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో కేవలం 3 సీట్లకే పరిమితం అయిన హస్తం పార్టీ ఈసారి పది స్థానాలకు పైగా విజయం సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది.

ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా ఖమ్మం, కరీంనగర్ స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇక ప్రధానంగా ఖమ్మం సీటు కోసం గట్టి పోటీ నెలకొంది. ఖమ్మం స్థానం కోసం డిప్యూటీ సి‌ఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గట్టిగా పోటీ పడుతున్నారు. భట్టి విక్రమార్క తన భార్యకు టికెట్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉండగా, పొంగులేటి తన తమ్ముడి కోసం, తుమ్మల తన కుమారుడి కోసం ప్రయత్నం చేస్తున్నారు.

ఎందుకంటే ఖమ్మం స్థానం కాంగ్రెస్ కంచుకోట. ఇక్కడ అభ్యర్థిని ఎవరిని ప్రకటించినా గెలుపు ఖాయమనే తెలుస్తుండటంతో కీలక నేతలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నామినేషన్లకు సమయం దగ్గర పడుతుండటంతో ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక ఖమ్మం సీటు కోసం కర్ణాటకకు వెళ్లారు భట్టి, పొంగులేటి. అయితే సీటు తమకంటే తమకని భీష్మించుకు కూర్చోవడంతో ఖమ్మం పంచాయతీ ఎటు తేలడం లేదు.

భట్టి సోదరుడు మల్లు రవి నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ చేస్తుండడంతో ఆయన కుటుంబంలోని మరొకరికి టిక్కెట్టు ఇవ్వడాన్ని పార్టీలోని ఒక వర్గం నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం సీటు ఎవరిదనేది ఖర్గే తేలుస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

Also Read:Gold Rate:లేటెస్ట్ ధరలివే

- Advertisement -