రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు ఎమ్మెల్యే కేటీఆర్. కాంగ్రెస్ 8 నెలల కాలంలో ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చారని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.
సభ వాయిదా వేయగానే డిప్యూటీ సీఎం భట్టి, అవసరమైతే సీఎం రేవంత్‌ను అశోక్ నగర్‌కు తీసుకెళ్దామన్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పర్సనల్‌గా వెళ్దాం…అక్కడ ఏఒక్కరైన కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క ఉద్యోగం వచ్చిందని చెప్పినా అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. అలాగే ఉద్యోగాలు ఇచ్చారని ఎవరైనా చెబితే అక్కడే ఉన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో సీఎం, డిప్యూటీ సీఎంకు పౌర సన్మానం చేయిస్తానని వెల్లడించారు.
ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని కానీ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో ఆలోచించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జాబుల జాతర బదులు అబద్దాల జాతర నడుస్తుందని…. ఇంట్లో ఉన్న క్యాలెండర్ మరో నాలుగు నెలల్లో మారిపోతది కానీ జాబ్ క్యాలెండర్ అత్త లేదు.. పత్త లేదు అని విమర్శించారు.
Also Read:‘తిరగబడరసామీ’..అందరికీ నచ్చుతుంది: శివకుమార్