సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం వాడివేడిగా సాగింది. ఇక ఈ సమావేశంలో పార్టీ లోక్ సభ పక్ష నేతగా బెంగాల్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి నియమితులయ్యారు. లోక్ సభా పక్ష నేతగా ఉండటానికి రాహుల్ గాంధీ ఏ మాత్రం ఒప్పుకోపోవడంతో రంజన్‌కు అదృష్టం వరించింది.
1999 నుంచి వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలుపొందారు రంజన్. ప్రస్తుతం ముర్షిదాబాద్ జిల్లాలోని బర్హంపురం లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1996 నుంచి 1999 వరకు బెంగాల్ ఎమ్మెల్యేగా పని చేశారు. అప్పటికి వరుసగా రెండుసార్లు లోక్ సభకు పోటీ చేసి ఓడిన ప్రణబ్ ముఖర్జీ 2004లో గెలవడంలో కీలకపాత్ర పోషించారు. 2009 ఎన్నికల్లో సైతం ప్రణబ్ గెలుపలో ఆయనది కీ రోల్. దీనికి ప్రతిఫలంగా 2012-14 మధ్య రైల్వే శాఖ సహాయ మంత్రి పదవికి ఆయనకు దక్కింది. 2012లో బెంగాల్ కాంగ్రెస్ చీఫ్‌గా పనిచేశారు.
కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో కనీసం పది శాతం సీట్లను కూడా పొందలేకపోయింది. దీంతో ప్రతిపక్ష హోదాను ఆ పార్టీ కోల్పోయింది. 2014లోనూ ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను పొందలేకపోయింది.