Congress: కాంగ్రెస్ ఎంపీ Vs కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

5
- Advertisement -

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. ఎంపీ సురేష్ షెట్కార్‌తో దూరంగా ఉంటున్నారు కాంగ్రెస్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావు.

పార్లమెంట్ ఎన్నికల సమయంలోను సురేష్ షెట్కార్ గెలుపుకోసం పని చేయలేదు ఎమ్మెల్యేలు. ఎన్నికల తర్వాత ఆ పరిస్థితి అలాగే కంటిన్యూ అవుతోంది. ఎంపీ సురేష్ షెట్కార్‌తో ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఇదే జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో తారాస్థాయికి చేరింది వర్గపోరు. పరిస్థితి ఇలానే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి డ్యామేజ్ అవుతుందని పార్టీ పెద్దలు సూచిస్తుండగా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read;RGV:కేసులకు భయపడేది లేదు

- Advertisement -