ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా: జీవన్‌ రెడ్డి

6
- Advertisement -

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానిన ప్రకటించారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతానని …ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పార్టీ కోసం తన జీవితాంతం పనిచేశానని..కానీ ఈ వయసులో తన సీనియారిటీ, సిన్సియారిటీకి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు,ఇన్‌ఛార్జీ దీపదాస్‌ మున్షీ కూడా మాట్లాడారని…ఈ స్టేజ్‌లో పార్టీ నుంచి గౌరవం కోరుకున్నా.. కానీ ఈ రోజు తనకు ఆ గౌరవం దక్కలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు నష్టం కలుగుతుందని తెలిసినా.. పార్టీ ఎక్కడ పోటీ చేయాలన్నా చేశానని చెప్పారు. అయితే బీజేపీ నుండి ఎవరూ తనను సంప్రదించలేదని స్పష్టం చేశారు.

జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడంపై కినుక వహించిన జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.

Also Read:యోగా…ఈజీ ఆసనాలివే!

- Advertisement -