పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే బూతు పురాణం

318
Congress MLA salms Linemen
- Advertisement -

ఆయనో ఎమ్మెల్యే. తన పనితీరు, మాటతీరుతో ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ తన స్ధాయి మరచి ఎమ్మెల్యే  లైన్‌ మెన్‌ను బండబూతులు తిట్టాడు. ఆయనే పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. తన ఇంటికి ఇష్టం వచ్చినట్లు కరెంటు వాడుకున్నాడు. కరెంట్ బిల్లు కట్టమన్నందుకు లైన్ మెన్‌ పై మండిపడ్డాడు. నువ్వెంత? నీ బతుకెంత? అంటూ విరుచుకుపడ్డారు. నీ అంతుచూస్తానని హెచ్చరించాడు. లైన్ మెన్‌ పై ఎమ్మెల్యే పీఏ దాడి చేశాడు. లైన్ మెన్‌ పై దాడి చేసిన రామ్మోహన్ రెడ్డి తీరుపై విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు.

ఎమ్మెల్యే రామ్మోహన్.. బాధిత లైన్‌మన్ మధ్య జరిగిన సంభాషణ

ఎమ్మెల్యే: ఏమనుకుంటున్నావ్ రా.. లం…… ఏమనుకుంటున్నావ్
లైన్ మన్: సార్.. సార్
ఎమ్మెల్యే: పగులగొడుత మళ్లొకసారి ఇట్ల చేసినవంటే..
లైన్ మన్: సార్.. సార్..
ఎమ్మెల్యే: నా ఇంట్లోనే కరెంట్ బంద్ చేస్తావ్ రా నువ్వు..
లైన్ మన్: సార్ నేను చెప్తా వినండి ప్లీజ్
ఎమ్మెల్యే: నా ఇంటికి రారా ఇప్పుడు.. నా దగ్గరికి రా నువ్ రారా ఇప్పుడు మా ఇంటికి..
లైన్ మన్: సార్ నేను..
ఎమ్మెల్యే: మీ డీఈ వచ్చి కూర్చున్నడు నా దగ్గర..
లైన్ మన్: సార్ ఒక్క నిమిషం సార్.. నేను కొండపల్లి అంతయ్య కొడుకును సార్..
ఎమ్మెల్యే: అరె నువ్ ఎవడివన్నాకా.. నా ఇంటికి కరెంట్ కట్ చేస్తావ్ రా..
లైన్ మన్: కరెంట్ కట్ చేయలేదు సార్.. అశోక్ రెడ్డి చెప్పిండు.. ఆయనే వల్గర్ గా మాట్లాడిండు..
ఎమ్మెల్యే: ఆయన వంకరగా మాట్లాడితే నువ్ కరెంట్ కట్ చేస్తావ్ రా..
లైన్ మన్: బంద్ చేయలే సార్.. నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన.. ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చిన, మీరు విజిట్ చేయడానికి వెళ్లారు..
ఎమ్మెల్యే: రికార్డ్ చేసినా అన్నవంట కదరా..
లైన్ మన్: ఆయన తిట్టిండు సార్.. నన్ను తిట్టిండు..
ఎమ్మెల్యే: అరే ఎందుకు తిడతారురా..
లైన్ మన్: నేనేమనలేదు సార్..
ఎమ్మెల్యే: సాయంత్రం స్తా అన్నాడు కదా..
లైన్ మన్: అవును నేను వెళ్లిపోయా సార్..
ఎమ్మెల్యే: మాక్కూడా రూల్స్ ఉంటాయ్.. అన్నవంట.. మాకు చెబుతావ్‌రా నువ్ రూల్స్..
లైన్ మన్: కాదు సార్.. నేనేమీ అనలేదు.. ఆయననే..
ఎమ్మెల్యే: అరేయ్.. ఈ ఏరియా పోస్టింగ్ రాంబాబుది.. ధర్మా రెడ్డి నన్నడిగాడు.. ఏడీ ఎవరైనా కావాలంటే సెలెక్ట్ చేసుకో అన్నాడు.. నేను డీఈని అడిగి పోస్టింగ్ చేయించిన.. అర్థమైందా..

లైన్ మన్: సార్.. సార్..
ఎమ్మెల్యే: నువ్వేందిరా నకరాలు చేసేది..
లైన్ మన్: సార్ నేను ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్న ఇక్కడ.. ఎప్పుడైనా ఇలా జరిగిందా సార్..
ఎమ్మెల్యే: ఇప్పుడు ఎందుకు కట్ చేసినవ్ అని అడుగుతున్నా..
లైన్ మన్: కావాలని క్రియేట్ చేశారు సార్.. వల్గర్ గా మాట్లాడారు..
ఎమ్మెల్యే: నా ఇంటికి కరెంట్ ఎందుకు కట్ చేసినవ్ అని అడుగుతున్నా..
లైన్ మన్: కరెంటు ఏం కట్ చేయలేదు సార్.. నేను ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చిన.. రూల్ అంటే కట్ చెయ్ అని అశోక్ రెడ్డి వల్గర్ గా మాట్లాడాడు సార్..
ఎమ్మెల్యే: ఆయన అట్లా అంటే కట్ చేస్తావా?..
లైన్ మన్: నేను కట్ చేయలేదు సార్..
ఎమ్మెల్యే: కట్ చేయలేదా.. మళ్లా ఎందుకు వచ్చినవ్ మరీ..
లైన్ మన్: నేను రాలేద్ సార్.. ఆఫీస్‌కు ఏడీఈ సార్‌కు చెప్పిన ఇలా అన్నారు అని.. అశోక్ రెడ్డి, నవాజ్ తిట్టినారు సార్..
ఎమ్మెల్యే: ఊరికెనే ఎందుకు తిడతారు రా..
లైన్ మన్: నేనేం అనలేదు సార్.. మేం ఏం అనలేదు.. కట్టము అని అంటే మేం వెళ్లిపోతాం కదా..

ఎమ్మెల్యే : నీకు కరెంట్ కట్ చేసేంత దమ్ముందారా నీకు.. ఎమ్మెల్యే ఇంటికి.. ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నావ్రా.. రేపు కరెంటు మంత్రి అవుతడు.. రేపు ముఖ్యమంత్రి అవుతడు. నువ్వెంత? నీ బుతకెంతరా..?
లైన్ మన్: కాదు సార్.. ఫోర్ ఇయర్స్ నుంచి ఎప్పుడైనా ఇలా జరిగిందా సార్..
ఎమ్మెల్యే: కట్ చేసి మళ్లీ ఆన్ చేశావ్..
లైన్ మన్: లేదు సార్..
ఎమ్మెల్యే: బిడ్డా మళ్లొకసారి ఇలా చేసినవంటే తోడ్కెలు ఇరగ్గొడ్తా.. అర్థమైందా..
లైన్ మన్: కాదు సార్.. ఒకప్పుడు నేను మీ కార్యకర్తను సార్.. మీరట్లా మాట్లాడితే బాధనిపిస్తోంది..
ఎమ్మెల్యే: రికార్డ్ చేసినా అన్నవంట కదరా..
లైన్ మన్: ఆయన తిట్టిండు సార్.. తిట్టింది రికార్డ్ చేసిన అని చెప్పా నేను..
ఎమ్మెల్యే: బిడ్డా మళ్లొకసారి ఇట్ల చేసినవంటే బాగుండదు.. నన్నొకసారి కలువు వచ్చి.. ఏం చెబుతున్నా..
లైన్ మన్: సార్.. సార్.. ఆ తర్వాత.. ‘కరెంట్ బిల్లు వసూలు కోసం పోతే ఎమ్మెల్యే పీఏ అశోక్ రెడ్డి నానా బూతులు తిట్టారు. ఈ విషయం మా అధికారితో చెప్పా. మళ్లీ ఎమ్మెల్యే పిలిస్తే ఆయన ఇంటికి పోయా. ఎమ్మెల్యే ముందే ఆయన పీఏ నన్ను కొట్టారు. క్షమాపణలు చెప్పాలని ఒత్తిడి చేశారు. నాతోపాటు పది మంది సిబ్బంది కూడా ఉన్నారు. మా అధికారులు, సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే పీఏపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నాం’ అని దాడికి గురైన లైన్‌మన్ చెప్పారు.

- Advertisement -