టీఆర్ఎస్‌లోకి జగ్గారెడ్డి?..చేరిక లాంఛనమేనా..?!

218
jagga reddy
- Advertisement -

కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కారెక్కనున్నారా..? అంటూ అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే ఆయన టీఆర్ఎస్‌లో చేరడం లాంఛనమే అని ప్రచారం జరుగుతోంది. ఇటీవలె కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్‌ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు,తాజాగా కేసీఆర్,కేటీఆర్‌లను ప్రశంసించడం చూస్తుంటే ఆయన కారెక్కడం ఖాయమని పొలిటికల్ వర్గాలు కొడై కూస్తున్నాయి.

ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గరి నుండి ఇకపై తాను సీఎం కేసీఆర్,ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయనని ప్రకటించిన సంచలనం సష్టించారు. తర్వాత దానికి కొనసాగింపుగా తనకు రాజకీయ జన్మనిచ్చింది టీఆర్ఎస్,కేసీఆర్ అని కొనియాడారు.

కేసీఆర్‌ కుటుంబంతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని రాజకీయం గా విమర్శించానని చెప్పారు. అయితే అదే సమయంలో హరీశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. తనను జైల్లో పెట్టించింది హరీశ్‌ రావేనని ఉనికి కోసమే తనను బలి చేసే యత్నం చేశారని దుయ్యబట్టారు.

అంతేగాదు హరీశ్‌తో పోలిస్తే కేటీఆర్‌ చాలా ఫెయిర్‌ అని వ్యాఖ్యానించారు. తాను జైల్లో ఉన్నప్పుడు సీనియర్‌ నేతలు ఉత్తమ్, వీహెచ్‌ తప్ప కాంగ్రెస్‌లో ఉన్న ఏ నాయకుడూ పట్టించుకోలేదన్నారు. ఆపద వస్తే ఆదుకుంటారనే విశ్వాసం కాంగ్రెస్‌లో లేదన్నారు. ప్రస్తుతం జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతారన్న వార్తలు పొలిటికల్ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

- Advertisement -