హైడ్రా పేరుతో అక్రమాలు: కాంగ్రెస్ ఎమ్మెల్యే

3
- Advertisement -

హైడ్రా పేరుతో అక్రమాలు జరుగుతున్నాయి అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. అసెంబ్లీ లాబీలో చిట్ చాట్‌గా మాట్లాడిన అనిరుధ్‌ రెడ్డి.. అన్ని త్వరలో బయట పెడతా, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అన్నారు.

పరిస్థితి దారుణంగా ఉంది. ఏకంగా ఎమ్మెల్యేలు ఇచ్చిన పిటిషన్లకు కూడా రిసిప్ట్ ఇవ్వడం లేదు అన్నారు. అసెంబ్లీ జీరో అవర్ లోనే ఈ విషయం లేవనెత్తుతా..స్వయంగా ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే, సామాన్యుడు చేసే కంప్లైంట్ ల పరిస్థితి ఏమిటి? చెప్పాలన్నారు.

హైడ్రా పేరుతో ఆ వెనక జరుగుతున్న విషయాలపై మాకు అనేక అనుమానాలు ఉన్నాయి అన్నారు. ఆ మంత్రిత్వ శాఖ సీఎం నేరుగా చూస్తున్నాడు కదా అన్న ప్రశ్నకు, మరి ఏం జరుగుతుందో వారిని అడగాలలన్నారు. టీటీడీలో తెలంగాణ ప్రభుత్వ సిఫారసు లేఖలు అనుమతించకపోవడంపై కూడా అసెంబ్లీలోనే మాట్లాడుతానని చెప్పారు.

Also Read:బీసీ ప్రజాప్రతినిధులతో పొన్నం భేటీ

- Advertisement -