చంద్రబాబు తెలంగాణకు రావొద్దు..కాంగ్రెస్ ఎమ్మెల్యే!

5
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. తిరుమ‌ల‌లో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార‌సు లేఖ‌ల‌ను అనుమ‌తించ‌క‌పోతే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

జడ్చర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన అనిరుధ్ రెడ్డి…ఆంధ్రోళ్ల‌కు మ‌న ద‌గ్గ‌ర ఆస్తులు కావాల‌ట‌. మొన్న‌నే రూ. 15 వేల కోట్లు తీసుకున్నారు.. అయినా కూడా మ‌నం ఏం అన‌లేదు అన్నారు. మ‌న ఆస్తులు కావాలి కానీ.. తిరుమ‌ల‌లో మ‌న‌కు హ‌క్కు లేకుండా చేయడం సరికాదన్నారు.

మ‌నం విడిపోయాక మ‌న సిఫార‌సు లేఖ‌లు చెల్ల‌వ‌ట. కానీ మ‌న ఆస్తులు కావాల‌ట‌. ఎమ్మెల్యేలంద‌రం క‌లిసి వీఐపీ లెట‌ర్లు చెల్లేలా ఒత్తిడి తీసుకొస్తాం. లేదంటే చంద్ర‌బాబు నాయుడు మ‌న తెలంగాణ‌కు రావాల్సిన అవ‌స‌రం లేదు అన్నారు.

Also Read;Jagan:డైవర్షన్ పాలిటిక్స్ ఇంకెన్నాళ్లు?

- Advertisement -