కాంగ్రెస్ మేనిఫెస్టో..హైలెట్స్ ఇవే!

31
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ప్రచార కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు హస్తం నేతలు. ఇకపోతే తాజాగా కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. న్యాయ్ పత్ర్ పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలతో కూడిన 25 గ్యారెంటీలను పొందుపరిచింది. భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్.. ఈ ఐదు అంశాలను హైలెట్ చేస్తూ అన్నీ వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా మేనిఫెస్టో రూపొందించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద పీఠ వేస్తూ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళాకు ఏటా లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయనున్నట్లు మేనిఫెస్టోలో తెలిపింది..

అంతే కాకుండా కేంర ప్రభుత్వ ఉద్యోగాలలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కూడా ఇవ్వనునట్లు ప్రకటించారు. యువత కోసం 30 లక్షల ఉద్యోగాల భర్తీ, అప్రెంటీస్ షిప్ కింద ఏడాదికి లక్ష రూపాయల చెల్లింపు, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన, కులాలు, ఉప కులలపై రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, అగ్ని వీర్ స్కీమ్ రద్దు, ఉపాధి హామీ పథకం కింద కనీస కూలి రూ.400 లకు పెంపు, వంట గ్యాస్ రూ.450, కిసాన్ న్యాయ్ కింద రైతులకు రుణమాఫీ, గిట్టుబాటు ధరపై చట్టబద్దత తీసుకురావడం,.. ఇలా దాదాపు 25 గ్యారెంటీలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇచ్చిన హామీలను గ్యారెంటీల రూపంలో కచ్చితంగా అమలు చేస్తామని హస్తం నేతలు చెబుతున్నారు, అయితే కాంగ్రెస్ ప్రకటించిన హామీలు బోగస్ హామీలని, అవన్నీ అమలుకు నోచుకోవని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించడంతో.. త్వరలో బీజేపీ కూడా మేనిఫెస్టో ప్రకటించనుంది. మరి బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read:రష్మిక బర్త్ డే..ది గర్ల్ ఫ్రెండ్

- Advertisement -