- Advertisement -
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మరో షాక్ తగిలింది. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబొర్ల పడ్డ కాంగ్రెస్ అది మరువక ముందే మరో షాక్ తగిలింది. శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా రద్దయింది. దీనికి సంబంధించిన గెజిట్‌ను మండలి కార్యదర్శి నర్సింహాచార్యులు విడుదల చేశారు. కాంగ్రెస్‌ఎల్పీ.. టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం కావడంతో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా రద్దయింది. కాంగ్రెస్ కు సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రమే ఉండటంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను రద్దు చేస్తు నిర్ణయం తీసుకుంది.
- Advertisement -