కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం 17% ఇచ్చి మోసం చేసింది అని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. కేసీఆర్ బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి కేవలం 17 శాతం మాత్రమే ఇచ్చాడు… బీసీలను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ రెండు చెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి అన్నారు.
ఇంత మాత్రం దానికి రూ.160 కోట్లు ఖర్చు చేశామని చెప్పి, కులగణన సర్వే చేసి, రాహుల్ రేవంత్ మోడల్ అని బిల్డప్ కొట్టడం దేనికి?, పార్టీ గుర్తు లేకుండా జరిగే ఎన్నికల్లో, పార్టీపరంగా రిజర్వేషన్లు ఇస్తామని అబద్ధాలు చెబుతున్నారు… ఇంత దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బీసీ ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తారు అన్నారు కేటీఆర్.
వరంగల్ జిల్లా అంటేనే పత్తి పంటకు, అజం జాహీ మిల్లుతో ఎంతో మందికి ఉపాధి కల్పించే జిల్లా… అలాంటి జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని కోల్పోయి, నేతన్నలు వలస వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది అన్నారు. అలాంటి వరంగల్ జిల్లాకు తిరిగి తన పూర్వ వైభవం రావాలని భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కును కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేశాం – కేటీఆర్ హైదరాబాద్ లోపల ఉండే కాలుష్య కారక పరిశ్రమలను, ఫార్మా ఇండస్ట్రీని తరలించడానికి ఫార్మా సిటీని మా ప్రభుత్వంలో ఏర్పాటు చేశాం అని గుర్తు చేశారు.
Also Read:మద్యం దుకాణాలపై సర్కార్‌కు చీవాట్లు!
కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేసి, 9300 ఎకరాల పారిశ్రామిక భూములను అమ్మి, రాహుల్ గాంధీకి తెలంగాణను ఏటీఎంగా చేయాలని చూస్తున్నారు… రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణం చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు.. దీన్ని బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అన్నారు కేటీఆర్.

