గులాబీ జెండానే తెలంగాణకు రక్షణ కవచం అన్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కందుకూరు మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సభావత్ లచ్చా నాయక్, పెద్దమ్మ తండా గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ సభావత్ సుమన్ నాయక్‌తో పాటు వారి అనుచరులు సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి… తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీతోనే ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఒక్క గ్యారెంటీ కూడా సక్రమంగా అమలు చేయకపోవడం దారుణమన్నారు.
కాంగ్రెస్ పార్టీని వీడి తమ పార్టీలో చేరడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కన్న తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరి మోసపోయామని లచ్చానాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:తెలంగాణలో తేలికపాటి వర్షాలు

