మంత్రి జగదీశ్ సమక్షంలో కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌లో చేరిక…

182
jagadish reddy
- Advertisement -

సూర్యాపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.. సూర్యాపేట మండలం హిమాంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయి భవనాన్ని ప్రారంభించారు.

అనంతరం గ్రామీణ పశువైద్య శాల నిర్మాణం కి భూమి పూజ చేశారు…ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై హిమాంపేట గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ ఉపేందర్ తోపాటు 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో trs పార్టీలో చేరారు.

గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు మంత్రి జగదీష్ రెడ్డి… కరోనా లాక్ డౌన్ కారణంగా అభివృద్ధి పనుల్లో వేగం తగ్గిందని, ఇక నుంచి సూర్యాపేట నియోజకవర్గంలో అభివృద్ధి పండుగ జరుగుతుందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

- Advertisement -