- Advertisement -
టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. తాజాగా నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. గుర్రంపోడు మండలంలోని పలు గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన 130 కుటుంబాలు నల్లగొండ ఎమ్మెల్యే, ఉప ఎన్నికల మండల ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
త్రిపురారం మండలంలోని నీలాయిగూడెం, అంజనపల్లి గ్రామాల్లో కాంగ్రెస్‌కు చెందిన 60 మంది కార్యకర్తలు మహబూబాబాద్ ఎమ్మెల్యే, ఉప ఎన్నికల మండల ఇన్‌చార్జి బానోతు శంకర్‌నాయక్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తిరుమలగిరి(సాగర్) మండలంలో ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, జాజాల సురేందర్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల నుంచి సుమారు వంద కుటుంబాలు టీఆర్‌ఎస్‌లో చేరాయి.
- Advertisement -