సీఎం ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ కు ఆహ్వానం

59
- Advertisement -

తెలంగాణ కొత్త సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. సీఎంగా రేపు 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనుండగా ఇందుకు ఎల్బీ స్టేడియం ముస్తావుతోంది. ఇప్పటికే ఏర్పాట్లను అటు అధికారులు, ఇటు కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ఇక రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీ జనసమీకరణకు ప్లాన్ చేస్తున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ నేతలతోపాటు ఇతర రాష్ట్రాల నాయకులు రానున్నారు. రేవంత్ స్వయంగా ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకలను ఆహ్వానించారు. అలాగే తెలంగాణ అమరుల కుటుంబాలు, కోదండరామ్, ఐలయ్య, హరగోపాల్ సహా అన్ని పార్టీల అధినేతలను రేవంత్ ఆహ్వానించారు.మాజీ సీఎం చంద్రబాబు,సీఎంలు స్టాలిన్, జగన్, పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానం అందింది.

Also Read:Revanth:రేవంత్ రెడ్డికి బిగ్ టాస్క్?

- Advertisement -