మాజీ మంత్రి బిఆర్ఎస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణవరావు కాంగ్రెస్ లో చేరబోతున్న సంగతి తెలిసిందే. ఈయనతో పాటు బిఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ లో చేరి ఎన్నికల ప్రచార కమిటీ కో చైర్మెన్ పదవిని కూడా చేపట్టారు. కానీ జూపల్లి కృష్ణరావు మాత్రం కాంగ్రెస్ లో అధికారిక సభ్యత్వం ఇంకా పొందనేలేదు. గత నెలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆర్భాటంగా కాంగ్రెస్ లో చేరాలని భావించినప్పటికి సభ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ రావడంతో కుదరలేదు.
అంతే కాకుండా జాతీయ నేతలు కూడా సభకు రావడానికీ ఆసక్తి చూపకపోవడంతో జూపల్లి చేరిక ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు గత నెల 30న సభ ఏర్పాటు చేయాలని భావించినప్పటికి వర్షాల కారణంగా సభ వాయిదా పడింది. ఇక మళ్ళీ సభ ఎప్పుడు నిర్వహిస్తారో అనే దానిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఇదిలా ఉంచితే ఇక సభ ప్రస్తావనే లేకుండా డిల్లీ వెళ్ళి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు జూపల్లి కృష్ణరావు. ఇప్పటికే డిల్లీ చేరుకున్న ఆయన రేపు కాంగ్రెస్ లో అధికారిక సభ్యత్వం పొండనున్నారు.
Also Read:ఏపీలో ఆ నిర్మాతకు ఇక గడ్డు కాలమే
ఇంతవరుకు బాగానే ఉన్నప్పటికి ఆయనకు కాంగ్రెస్ లో అధిష్టానం ఎలాంటి పదవి ఇవ్వబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పొంగులేటికి కీలక పదవి అప్పగించిన వేళ జూపల్లికి కూడా ప్రదాన్యం ఉన్న పదవి కట్టబెడితే పార్టీలోని సీనియర్ నేతలు నుంచి వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే పదవుల విషయంలో పొన్నాల ప్రభాకర్ లాంటివాళ్ళు పార్టీ హైకమాండ్ పై గుర్రుగా ఉన్నారు. దాంతో కొత్తగా వచ్చిన జూపల్లి కృష్ణారావుకు అధిష్టానం ఏ పదవి కట్టబెట్టిన కొత్త చిక్కులు ఏర్పడక తప్పదు. ప్రస్తుత పరిణామాలు చూస్తే జూపల్లికి ప్రాధాన్యత ఉన్న పదవి లభించడం కష్టమే అని చెప్పాలి. మరి ఆ విధంగా చూస్తే జూపల్లి కృష్ణారావుకు నిరాశ తప్పెలా లేదు.
Also Read:ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పిన తమన్నా