కౌశిక్‌ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాల రాళ్ల దాడి

3
- Advertisement -

హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లతో దాడి చేశారు కాంగ్రెస్ గుండాలు. ఇంటిపై కోడి గుడ్లు, టమాటాలు విసిరేశారు. అక్కడే ఉన్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కుర్చీలతో దాడికి దిగారు. అడ్డు వచ్చిన పోలీసులను కొట్టే పరిస్థితి నెలకొంది.

పోలీసులను తోసుకుంటూ మరి కౌశిక్ ఇంటిపై దాడి చేశారు ఎమ్మెల్యే గాంధీ అనుచరులు. గేటు దూకి మరి ఇంట్లోకి చొచ్చుకెళ్లి మరి కొట్టారు కాంగ్రెస్‌ కార్యకర్తలు.అక్కడే ఉన్న ఎమ్మెల్యే గాంధీ దాడి చేసేలా వారిని ఎగదోశారు.

నీ ఇంటికి వచ్చా.. చూస్కుందాం రా.. అంటూ కౌశిక్‌ రెడ్డికి గాంధీ సవాల్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బయటకు రావాలంటూ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు గాంధీని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

Also Read:Kaushik Reddy:బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే పార్టీ ఆఫీస్‌కు రండి

- Advertisement -