బీఆర్ఎస్ నేతల వాహనాలపై రాళ్ల దాడి..

11
- Advertisement -

వరద బాధితులకు అండగా నిలబడేందుకు బీఆర్ఎస్ నేతలు ఖమ్మంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఖమ్మంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంచుతుంటే బీఆర్ఎస్ నేతలతో గొడవకు దిగారు. ఈ దాడిలో నర్సాపూర్ బిఆర్ఎస్ నేత సొంతోష్ కాలు విరిగింది. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు.

ఆందోళ‌న‌కారుల‌ను పోలీసులు నిలువ‌రించ‌కుండా ప్రేక్ష‌క‌పాత్ర వ‌హించగా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల అరాచ‌కాల‌పై స్థానికులు తీవ్రంగా మండిప‌డ్డారు. మీరు స‌హాయం చేయ‌లేదు.. కానీ స‌హాయం చేస్తున్న బీఆర్ఎస్ నేత‌ల‌పై దాడులు స‌రికాద‌ని స్థానికులు పేర్కొన్నారు.

కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల గుండాయిజంపై మంచికంటి న‌గ‌ర్ వాసులు నిప్పులు చెరిగారు. క‌నీసం ఇప్ప‌టి వ‌ర‌కు తాము తిండి తిన‌లేద‌ని, నిత్యావ‌స‌రాలు ఇచ్చేందుకు వ‌చ్చిన బీఆర్ఎస్ నాయ‌కుల‌పై దాడుల‌కు పాల్ప‌డిన కాంగ్రెస్ నేత‌ల‌కు పాపం పండుతుంద‌ని స్థానికులు శాప‌నార్థాలు పెట్టారు.

Also Read:పోలీస్ వారి హెచ్చరిక…ఫస్ట్ లుక్

- Advertisement -