వరంగల్ కాంగ్రెస్‌లో ముసలం

19
- Advertisement -

వరంగల్‌ కాంగ్రెస్‌లో ముసలం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్యను ఎంపిక చేసిన దగ్గరి నుండి విమర్శలు చేస్తూ వస్తున్న నాయకులు ఇప్పుడు తమ స్వరాన్ని తీవ్రం చేశారు.

వరంగల్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య ముందే కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. కొత్తగా కాంగ్రెస్‌లోకి వచ్చిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మొదలైన గొడవ పెద్దదైంది. కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలు, పాత కార్యకర్తలుగా రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం కొట్టుకున్నారు. ఎంతకు గొడవ సద్దుమనగక పోవడంతో సమావేశం మధ్యలో నుండే వెళ్లిపోయారు కడియం కావ్య.

వాస్తవానికి అంతర్గతపోరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావ్య. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉండటంతో ఆమె గెలుపుపై హస్తం నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.

Also Read:చికెన్‌ తింటున్నారా.. జాగ్రత్త !

- Advertisement -