ప్రధానమంత్రి నరేంద్రమోడీని దొంగ అంటూ ట్వీట్ చేసినందుకు కాంగ్రెస్ నేత,మాజీ ఎంపీ,సినీ నటి రమ్యపై దేశ ద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై కేసు పెట్టిన వారిని ఎద్దేవా చేస్తూ వెనక్కి తగ్గేదే లేదంటూ స్పష్టం చేశారు రమ్య. ఈ మేరకు ట్వీట్టర్‌లో ట్వీట్ చేసిన రమ్య తనకు మద్దతు తెలిపిన వారికి కృతజ్ఞతలు చెబుతూనే ఆ ట్వీట్‌ని ఇష్టపడని వారికి నేనేం చెప్పాలి అంటూ ప్రశ్నించింది.
ఈ సారి ట్వీట్ చేసేటప్పుడు కొత్తగా ట్రై చేస్తాను అని చురకలంటిస్తూనే దేశ ద్రోహం చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది. అంతేగాదు చోర్ మోడీ అనే హ్యాష్ ట్యాగ్‌ని జత చేస్తూ విమర్శలను ఎక్కుపెట్టింది.
మోడీని దొంగ అంటూ పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని గోంతీ నగర్ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది సయ్యద్ రిజ్వాన్ అహ్మద్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో రమ్యపై దేశద్రోహం కేసును పెట్టారు పోలీసులు. ఈ నేపథ్యంలో స్పందించిన రమ్య …సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలను సంధిస్తునే ఉంది.
Thank you guys for extending your support and for those who didn’t like the tweet, well, what can I say? Will keep it ‘classy’ next time 😊
India should do away with the sedition law, it’s archaic and misused.
To the folks who filed the FIR- #PMChorHai 🤭😀— Ramya/Divya Spandana (@divyaspandana) September 26, 2018