కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. మంగళవారం ఉదయం కేసీ వేణుగోపాల్ ఫోన్ చేయడంతో జగిత్యాల నుంచి హుటాహుటిన బయల్దేరిన జీవన్ రెడ్డి, ఢిల్లీ ప్రయాణానికి సిద్ధమైనట్లు తెలిసింది.
అయితే అనూహ్యంగా హైదరాబాద్ వరకు వెళ్లిన ఆయన, అక్కడే మనసు మార్చుకుని తిరిగి జగిత్యాలకు చేరుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి బీ-ఫారంల కేటాయింపులో అన్యాయం జరిగిందని జీవన్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీడియా ముందు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పార్టీ నిర్ణయాలపై ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ పిలుపు రావడం, తరువాత ప్రయాణం రద్దు కావడం వెనుక కారణాలేమిటన్నది ఆసక్తికరంగా మారింది. అధిష్టానం ఆయనతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలనుకుంటోందని భావిస్తున్నారు. మరోవైపు, జీవన్ రెడ్డి తిరిగి వెళ్లిపోవడం వెనుక రాజకీయ సమీకరణాలున్నాయా అన్నది కూడా చర్చకు దారితీసింది. ఈ పరిణామాలు కాంగ్రెస్‌లో అంతర్గత చర్చలకు దారితీసే అవకాశముంది.
Also Read:డీసెంట్ కలెక్షన్స్‌తో ‘నిలవే’!

