కాంగ్రెస్‌లో హీట్..ఢిల్లీకి జగ్గారెడ్డి

16
- Advertisement -

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. 2017 వ సంవత్సరం లో సంగారెడ్డి లో రాహుల్ గాంధీ సభ జరిగింది. ఆ సభ ఏర్పాట్ల కోసం నేను ఎంత కష్ట పడ్డానో రాహుల్ గాంధీకి చెప్పడానికి డిల్లీ కి బయలుదేరిన అని తెలిపారు.

నేను ఎమ్మెల్సీ అదుగుతలేను. నేను అడగొద్దు.. … నాకు పార్టీ ఆల్రెడీ టికెట్ ఇచ్చింది. పోటీ చేసిన. పరిస్థితులు అనుకూలించక ఓడిపోయిన అన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యే గా ఉన్నా…. ఎమ్మెల్సీ కావాలని పడీ పడి అడిగే గుణం నాది కాదు అన్నారు.

రాహుల్ గాంధీ గారి సభ ఆర్గనైజేషన్ , ఎలాంటి పరిస్థితుల్లో సభ ఏర్పాట్లు చేశానో ఆ విషయాలన్నింటినీ రాహుల్ గాంధీకి స్వయంగా చెప్పాలని డిల్లి కి బయలుదేరిన.. అక్కడికి వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ అపాయిట్మెంట్ కొరుతానని చెప్పారు. అపాయంట్మెంట్ దొరికితే వారితో మాట్లాడుతానని చెప్పారు. జగ్గారెడ్డి ఢిల్లీ పర్యటన కాంగ్రెస్‌లో హీట్ పెరిగిపోయింది.

Also Read:ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై మోదీ

- Advertisement -