కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ నేత

7
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ లీడర్ మహమ్మద్ అలావుద్దీన్ పటేల్ సహా ఆయన అనుచరులు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి పైసలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వచ్చేవి అన్నారు.

రాష్ట్రంలో పండుగ జరుపుకునే పరిస్థితి లేకుండా భయానక వాతావారణం సృష్టించారు అన్నారు. వరంగల్ లో ఓ ఎమ్మార్వో ను బతుకమ్మ ఘాట్ చూసేందుకు వెళితే ఇళ్లు కూలగొట్టేందుకు వచ్చారనుకొని వాళ్లను తరమికొట్టారంట. అలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి ఉందన్నారు. యూపీ లో అక్కడ సీఎం బుల్డోజర్ రాజ్ ను నడిపిస్తున్నాడని మనం గతంలో అనుకున్నాం. కానీ మన తెలంగాణలో కూడా ఇప్పడు అలాంటి బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చారు అన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ చేస్తున్న ఆఘాయిత్యాలను చూసి ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారిని తలచుకుంటున్నారు….అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ పది నెలల వాళ్ల పాలనలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి…డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్ డే రోజునే 2 లక్షలు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ స్వయంగా హామీ ఇచ్చారు అన్నారు.

కేసీఆర్ జాబ్ పొగొట్టండి. మీకు ఏడాది లో 2 లక్షల ఉద్యోగాలంటూ రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చి నా గ్యారంటీ అని హామీ ఇచ్చాడు అన్నారు…కానీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కి తప్ప తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాలేదు అన్నారు. మహిళలకు రూ. 2500 ఇస్తా అన్నాడు. కోటి 60 లక్షల మంది మహిళలు రూ. 2500 ల కోసం వేచి చూస్తున్నారు…వృద్ధులకు రూ. 4 వేలు అన్నాడు. ఇంట్లో ఇద్దరికీ పింఛన్ అన్నాడు. ఒక్కరికన్నా వచ్చిందా? ఆలోచించాలన్నారు.

Also Read:కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు..

- Advertisement -