సభ వాయిదా..మరి ప్రియాంకగాంధీ సంగతేంటి?

56
- Advertisement -

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ యమ దూకుడు ప్రదర్శిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలవాలని విశ్వ ప్రయత్నలే చేస్తోంది. పార్టీ నేతలతో తరచూ సమావేశాలు, వరుసగా బహిరంగ సభలు, జాతీయ నేతల టూర్లు.. ఇలా బిజీ బిజీగా సాగుతోంది టి కాంగ్రెస్ షెడ్యూల్. కాగా ఈ నెల 30 న కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మరోసారి రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షించాలని టి కాంగ్రెస్ భావించింది. అయితే రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సభ వాయిదా వేయక తప్పలేదు. ఈ సభను ఆగష్టు 5 నా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు హస్తం నేతలు. .

అని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 30న జరిగే సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని భావించారు జూపల్లి కృష్ణరావు. కానీ ప్రస్తుతం సభ వాయిదా పడింది. అయితే ఈ సభ ఇప్పటికే జరగాల్సి ఉండగా వాయిదాలు పడుతూనే వస్తోంది. ఈ నెల 2 న జరిగిన సభతో పొంగులేటి కాంగ్రెస్ లో చేరారు. ఆ తరువాత వారం గడవక ముందు బహిరంగ సభ ఏర్పాటు చేసి గ్రాండ్ గా తను కూడా కాంగ్రెస్ లో చేరాలని భావించారు జూపల్లి. కానీ జాతీయ నేతలు సభకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో సభ వాయిదా పడుతూ వచ్చింది.

Also Read:వర్షాలను రాజకీయం చేయొద్దు: కేటీఆర్

ఈ నెల 30న జరగాల్సిన సభకు కూడా ప్రియాంక గాంధీ వస్తారనే విషయాన్ని టి కాంగ్రెస్ నేతలు కచ్చితంగా చెప్పలేక పోయారు. జూపల్లి నే డిల్లీ పిలిచి కాంగ్రెస్ సభ్యత్వం ఇవ్వాలని హస్తం హైకమాండ్ భావిస్తున్నట్లు టాక్. అందుకే కొల్లాపూర్ సభను కాంగ్రెస్ అధిస్థానం లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అనూహ్యంగా వర్షాల కారణంగా ఇప్పుడు సభ వాయిదా వేయక తప్పలేదు. దాంతో ఆగష్టు 5న నైనా ప్రియాంక గాంధీ వస్తారా లేదా అనేది చెప్పలేని పరిస్థితి. మరి కొల్లాపూర్ సభతో మరోసారి వార్తల్లో నిలవాలని చూస్తున్న టి కాంగ్రెస్ ఆశలకు అధిష్టానం ఎంతవరకు సమ్మతిస్తుందో చూడాలి.

Also Read:పార్టీలు రెడీ.. నోటిఫికేషన్ ఎప్పుడు ?

- Advertisement -