కాంగ్రెస్ కామారెడ్డి సభ వాయిదా పడింఇ. ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను వాయిదా వేశారు. భారీ వర్ష సూచన కారణంగా వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని పీసీసీ వర్గాలు వెల్లడించాయి.
వాస్తవానికి సెప్టెంబర్ 15వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కామారెడ్డి సభ ద్వారా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సభను నిర్వహించ తలపెట్టారు.
అలాగే ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆహ్వానించారు కూడా. అలాగే పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలకు ఆహ్వానాలు కూడా పంపారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో సభను వాయిదా వేశారు.
Also Read:సోషల్ మీడియాకు దూరం..అనుష్క!

