సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ వీడే అవకాశం ఉందని గత కొన్నాళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇతర వార్తలను ఆయన తరచూ ఖండిస్తూనే ఉన్నప్పటికి వార్తలు మాత్రం ఆగడం లేదు. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా జగ్గారెడ్డి అలాంటిదేమీ లేదని చెబుతున్నా.. లోలోపల అన్నీ జరుగుతున్నాయనేది కొందరు రాజకీయ వాదులు చెబుతున్నా మాట. గత కొన్నాళ్లుగా ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు అంటిఅంటనట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి అసహనం గానే ఉన్నారాయన..
ఇక ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు కూడా జగ్గారెడ్డిని నిరాశపరిచినట్లు టాక్. పార్టీ లో కొత్తగా చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వారికి కీలక పదవులు ఇచ్చారని తనలాంటి సీనియర్ నేతలను పార్టీలో కనుమరుగయ్యేలా చేస్తున్నారనే అసంతృప్తి జగ్గారెడ్డిలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన కాంగ్రెస్ వీడి అధికార బిఆర్‌ఎస్ లో చేరేందుకు మార్గం వెతుక్కుంతున్నారట. ఈ నెల 19 లేదా 20 తేదీ నాటికి ఆయన పార్టీ మాడడంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Also Read:స్కిన్ అలర్జీ..అయితే జాగ్రత్త!
ఒకవేళ జగ్గారెడ్డి పార్టీ విడితే.. కాంగ్రెస్ కు గట్టి షాక్ తగలడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ చేరికలను ఆకర్షించే పనిలో ఉంది. ఇలాంటి సందర్భంలో జగ్గారెడ్డి పార్టీని విడితే ఈయన దారిలోనే మరికొంత మంది నేతలు కాంగ్రెస్ వీడిన ఆశ్చర్యం లేదు. ఇక నాగం జనార్ధన్ రెడ్డి వంటివారు సైతం పార్టీ విడతారనే టాక్ వినిపిస్తోంది. అయితే తాను కాంగ్రెస్ వీడే ప్రసక్తే లేదని తాజాగా క్లారిటీ ఇచ్చారు. మరి జగ్గారెడ్డి కూడా క్లారిటీ ఇస్తారా ? లేదా సైలెంట్ గా పార్టీ నుంచి సైడైపోతరా అనేది చూడాలి.
Also Read:జర్నలిస్ట్ బాబాయి కృష్ణారావు ఇకలేరు..