వంశీకి ప్రమోషన్ రేవంత్‌కు చెక్ పెట్టేందుకేనా…?

103
revanth
- Advertisement -

ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్ర పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ‌్యతలు చూస్తున్న వంశీచందర్‌ రెడ్డిని తాజాగా ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు సహాయకుడిగా నియమిస్తూ సోనియాగాంధీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ వ్యక్తికి జాతీయ కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు అప్పగించినట్లైంది. ఇక నుంచి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలన్నీ వేణుగోపాల్‌తో పాటు వంశీ చూడనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వంశీచందర్‌రెడ్డికి హైకమాండ్‌లో కీలక బాధ్యతలు అప్పగించడంపై కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతుందంట..వంశీకి ప్రమోషన్ ఓ విధంగా రేవంత్ రెడ్డి దూకుడుకు చెక్ పెట్టేందుకే అన్నట్లుగా గాంధీభవన్‌లో టాక్ నడుస్తుందంట..ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో టీడీపీ నుంచి వచ్చి పీసీసీ చీఫ్ అయిన రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సీనియర్లకు విబేధాలు భగ్గుమంటున్నాయి.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మాంచి ఊపు తెచ్చినా సీనియర్లు తనకు సహకరించడం లేదని రుసరుసలాడుతున్నాడు. ఓ వైపు టీడీపీ నుంచి వస్తున్న నేతలకు పెద్దపీట వేస్తూ దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తున్న తమను పక్కనపెడుతూ, సభలు, సమావేశాలకు పిలువకుండా అవమానిస్తుంటే ఎలా సహకరిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్‌పై మండిపడుతున్నారంట.. కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి , మల్లుభట్టి విక్రమార్క, వీహెచ్, మర్రిశశిధర్ రెడ్డి వంటి సీనియర్లు రేవంత్‌రెడ్డి తీరుపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారంట..ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యాడని, ఇందుకోసం గోల్కొండ రిసార్ట్‌లో ఈటలతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాడని, ఈ మేరకు కాంగ్రెస్ అభ్యర్థికి డిపాటిజ్ కూడా దక్కకుండా సొంత పార్టీ నేతలు, కార్యకర్తలను ఈటలకు క్రాస్ ఓటింగ్ చేయాల్సిందిగా ఆదేశించాడని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సొంత పార్టీని చిత్తుగా ఓడించేందుకు ప్రయస్తున్న రేవంత్ రెడ్డి లాంటి పీసీసీ చీఫ్‌ను ఇంతవరకు చూడలేదని, ఇదేం నాయకత్వం అని కొందరు సీనియర్లు కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారంట. ఇప్పటికే రేవంత్‌రెడ్డిపై సీనియర్లు ఎంత ఫిర్యాదు చేసినా..రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుందనే నమ్మకంతో వెనకేసుకువచ్చిన ఢిల్లీ హైకమాండ్ హుజురాబాద్ బై పోల్‌లో రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిందంట..తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ రెడ్డి రేవంత్ రెడ్డి విసిరిన నోట్ల కట్టలకు అమ్ముడుపోయాడని కోమటిరెడ్డి వంటి సీనియర్ నేతలు చేసిన గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా కాంగ్రెస్ అధిష్టానం పరిగణనలోకి తీసుకుందంట..

అందుకే రేవంత్‌ దూకుడుకు చెక్ పెట్టేందుకు అదే జిల్లాకు చెందిన వంశీచందర్ రెడ్డికి హైకమాండ్‌లో కీలక బాధ్యతలు అప్పగించినట్లు హస్తం పార్టీలో టాక్ నడుస్తోంది.. ఇక నుంచి రేవంత్ రెడ్డి సంస్థాగతంగా పార్టీ పదవులు నియమించాలన్నా,,వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలన్నా..సోనియా, రాహుల్‌ను కలవాలన్నా..ముందుగా వంశీచందర్‌ రెడ్డిని కలవాల్సిందే. మొత్తంగా రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ సీనియర్లకు మధ్య విబేధాలు రగులుతున్న టైమ్‌లో వంశీచందర్ రెడ్డికి హైకమాండ్‌లో కీలక పదవి దక్కడం పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. రేవంత్‌కు ప్రాధాన్యత ఇస్తూనే..సీనియర్లను వదులుకునేది లేదని హైకమాండ్ చెప్పకనే చెప్పిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వంశీకి ప్రమోషన్ ఓ రకంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దూకుడుకు చెక్ పెట్టేందుకే అని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుందంట..

- Advertisement -