జగ్గారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ షాక్..

55
jaggareddy
- Advertisement -

ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఊహించని షాకిచ్చింది. పార్టీకి సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి ఆయనను తప్పించింది. ఈ మేరకు టీపీసీసీ సోమవారం ప్రకటించింది. పార్టీకి సంబంధించి జగ్గారెడ్డి నిర్వర్తించే బాధ్యతలను మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌, మహేష్‌గౌడ్‌లకు అప్పగిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

కొంత కాలంగా పార్టీ నిర్ణయాలపైనా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు జగ్గారెడ్డి. ఈ నేపథ్యంలోనే కొన్నిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు.

తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి తీరును తీవ్రంగా పరిగణించిన హైకమాండ్.. ఆయనను పార్టీ బాధ్యతలన్నింటి నుంచి తప్పించింది.

- Advertisement -