సుప్రియా శ్రీనాతేకు షాకిచ్చిన కాంగ్రెస్‌

29
Kangana Ranaut and Supriya Shrinate
- Advertisement -

సినీ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్ధి కంగనా రనౌత్‌పై వివాదాస్పద కామెంట్స్ చేసిన సుప్రియా శ్రీనాతేకు కాంగ్రెస్ షాకిచ్చింది. 2019లో ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్‌ నుండి పోటీ చేసి ఓడిపోయారు సుప్రియా. అయితే ఈ సారి ఎలాగైన గెలవాలని గెలుపు వ్యూహాలు రచించగా కంగనాపై కామెంట్స్ నేపథ్యంలో ఆమెకు టికెట్ నిరాకరించింది కాంగ్రెస్. సుప్రియా స్థానంలో పార్టీ తరఫున వీరేంద్ర చౌదరికి టికెట్ కేటాయించింది.

హిమాచల్‌ ప్రదేశ్‌ మండి నుంచి కంగనా పోటీ చేస్తుండగా సోషల్‌ మీడియాలో కంగనాపై సుప్రియా అభ్యంతరకర పోస్ట్‌ చేయగా దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. సుప్రియాకు ఎన్నికల సంఘం బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కంగనాతో పాటు బీజేపీ నేతలు దీనిని రాజకీయ అస్త్రంగా వాడుకోవడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆమెకు టికెట్ నిరాకరించింది.

Also Read:కాల్షియం తగ్గిందా.. ఇవి తినండి!

- Advertisement -