తెలంగాణలో బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ అందిస్తున్న సుపరిపాలన దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ మోడల్ కు దేశ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తూ కేసిఆర్ పాలనపై ప్రశంశలు కురిపిస్తున్నారు. అందుకే బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే దేశ వ్యాప్తంగా విస్తరించింది. తెలంగాణలో అమలౌతున్న 24 గంటల ఉచిత కరెంట్, దళిత బంధు, రైతు బంధు.. వంటి పథకాలు మరే ఇతర రాష్ట్రాల్లో అమలుకు నోచుకోవడం లేదు. ఎక్కడ లేని విధంగా కేవలం తెలంగాణలోనే అమలు చేస్తూ సంక్షేమానికి కొత్త అర్థాన్ని తీసుకొచ్చారు ముఖ్యమంత్రి కేసిఆర్.
కాగా తెలంగాణలో అమలౌతున్న పథకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నప్పటికి.. ఆ ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ కర్నాటక పార్టీ చీఫ్ డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంట్ అమలౌతోందని, కానీ కర్నాటకలో 5 గంటలే కరెంట్ ఉంటుందని స్వయంగా డీకే చెప్పడంతో కాంగ్రెస్ లోని డొల్లతనం బయటపడింది. తాము అధికారంలోకి వస్తే 24 గంటల విద్యుత్ ఇస్తామని ఓవైపు కాంగ్రెస్ చెబుతుంటే.. డీకే మాత్రం 5 గంటల కరెంటే అంటూ వ్యాఖ్యానించడంతో హస్తం నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ప్రస్తుతం కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీల విషయంలో ఇప్పటికే చేతులెత్తేసింది. ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు.. వంటి పథకాలపై ఇప్పటికే ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. దీంతో ఆల్రెడీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో హామీల అమలు ఎంతవరకు చేస్తుందనేది సందేహమే. మొత్తానికి హామీల అమలు విషయంలో ఆల్రెడీ ప్లాప్ అయిన కాంగ్రెస్.. తెలంగాణలో బిఆర్‌ఎస్ గ్రేట్ అని పరోక్షంగా ఒప్పుకున్నట్లేనని రాజకీయ వాదులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read:World Cup 2023:మనల్నెవడ్రా.. ఆపేది!