- Advertisement -
కాలింగ్ కాంగ్రెస్ 6 గ్యారంటీలు & రేవంత్ రెడ్డి 420 హామీలు పేరుతో ఇంటింటికీ కాంగ్రెస్ మోసపు మేనిఫెస్టో బుక్‌లెట్లు పంపిణీ చేశారు ముఖ్రా (కె) సర్పంచ్ గాడ్గే మీనాక్షి.
అధికారంలోకి రాగానే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు 20 నెలలు గడిచినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ ఇచ్చిన మోసపు హామీలను ప్రజలకు గుర్తు చేస్తూ ఇంటింటికీ బుక్లెట్లను పంపిణీ చేశారు.
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ, ముఖ్రా (కె) గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ 420 మోసపు హామీల బుక్‌లెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గే సుభాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Also Read:కింగ్‌డమ్…సెకండ్ డే వసూళ్లు!
- Advertisement -

